world organ donation day: మరణం నుంచి జననం!
మరణంలో జననం! చావు అనివార్యమై, అచేతనావస్థలో ఉన్నా మరొకరి ప్రాణాలు నిలబెట్టగలిగితే? అంతకన్నా గొప్ప విషయమేముంది? అవయవదానం అలాంటి సదవకాశాన్నే కల్పిస్తుంది. చనిపోయినా మరొకరిలో జీవించే వరాన్ని ప్రసాదిస్తుంది. అవయవాలు విఫలమై, ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్న దశలో ఉన్న మరొకరికి పునర్జన్మనిస్తుంది.
నేడు వరల్డ్ ఆర్గన్ డొనేషన్ డే
మరణంలో జననం! చావు అనివార్యమై, అచేతనావస్థలో ఉన్నా మరొకరి ప్రాణాలు నిలబెట్టగలిగితే? అంతకన్నా గొప్ప విషయమేముంది? అవయవదానం అలాంటి సదవకాశాన్నే కల్పిస్తుంది. చనిపోయినా మరొకరిలో జీవించే వరాన్ని ప్రసాదిస్తుంది. అవయవాలు విఫలమై, ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్న దశలో ఉన్న మరొకరికి పునర్జన్మనిస్తుంది. మరణం నుంచి జననంలోకి అడుగేయిస్తుంది. ఇది ఎప్పటి నుంచో అందుబాటులో ఉన్నా చాలామందికి దీని గురించే తెలియటం లేదు. సరైన అవగాహన లేకపోవటం వల్ల ఎంతోమంది ముందుకు రావటం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం.
ఏంటీ అవయవదానం?
అవయవ దానం రెండు రకాలు. 1. సజీవ (లైవ్) దానం. బతికున్నవారు అవయవాన్ని లేదా అవయవ భాగాన్ని దానం చేయటం. కిడ్నీ, కాలేయ, రక్త దానం వంటివి ఇలాంటివే. మనం ఒక కిడ్నీ ఉన్నా జీవించొచ్చు. కొంత భాగాన్ని దానం చేసినా కాలేయం తిరిగి వృద్ధి చెందుతుంది. అందువల్ల బతికున్నవారు ఇలాంటి అవయవాలను దానం చేయటానికి వీలవుతుంది. ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఫిట్‌గా ఉండి, గ్రహీతల రక్తం గ్రూపుతో సరిపోయిన వారు అవయవాలను దానం చేయొచ్చు. 2. జీవన్మృతి (కెడావర్) దానం. అంటే మరణించిన తర్వాత అవయవాలను దానం చేయటం. దీనికి సిద్ధపడినవారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మరణించిన తర్వాత వారి సన్నిహిత కుటుంబ సభ్యులైనా దానం చేయటానికి అంగీకరించొచ్చు. అవయవ దాతలు ఎలా చనిపోయారన్నదీ కీలకమే. బ్రెయిన్ డెత్ అయినవారి నుంచి గుండె, ఊపిరితిత్తి, కిడ్నీ, కాలేయం, పాంక్రియాస్, పేగుల వంటి అన్ని కీలక అవయవాలనూ గ్రహించొచ్చు. ఒకవేళ సహజ మరణం అయినట్టయితే కంటి కార్నియా, చర్మం, ఎముక, గుండె కవాటాలు, రక్తనాళాల వంటి కణజాలాల దానానికి మాత్రమే వీలుంటుంది. ఎందుకంటే మనిషి మరణించిన తర్వాత ఆక్సిజన్ సరఫరా కాకపోవటం వల్ల కీలక అవయవాలు చనిపోతాయి.
ఎవరు దానం చేయొచ్చు?
బతికి ఉన్నప్పుడు కిడ్నీ వంటి అవయవాలను 18 ఏళ్లు నిండినవారు ఎవరైనా చేయొచ్చు. జీవన్మృతి అయితే వయసు, ఆరోగ్య చరిత్రతో సంబంధమేమీ ఉండదు. ఆడవారైనా, మగవారైనా, ఏ మతం వారైనా అవయవ దాతలు కావొచ్చు.
గుండె స్తంభించి మరణించినవారు దానం చేయొచ్చా?
నిజానికి గుండె స్తంభించటం (కార్డియాక్ అరెస్ట్)తో మరణించిన తర్వాతా అవయవాలను తీసుకోవచ్చు. అయితే ఒక తేడా ఉంది. బ్రెయిన్ డెడ్ అయినవారు చాలావరకూ ఐసీయూలో ఉంటారు. వీరి ప్రాణాలు నిలపటానికి కృత్రిమ శ్వాస వంటి చికిత్సలు కొనసాగుతుంటాయి. అందువల్ల తొలగించేంత వరకూ ఆక్సిజన్, రక్తం అందటం వల్ల అన్ని అవయవాలనూ తీసుకోవచ్చు. అదే గుండె స్తంభించటం వల్ల మరణిస్తే అవయవాలు చాలా వేగంగా క్షీణిస్తుంటాయి. కాబట్టి కొద్ది నిమిషాల్లోనే తీసుకోవాల్సి ఉంటుంది. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో దీన్ని అనుసరిస్తున్నారు. మనదేశంలో ఇంకా పాటించటం లేదు.
దాతల విశ్లేషణ ఎలా?
అప్పటికే ఉన్న జబ్బులు, వయసు, మొత్తంగా ఆరోగ్యం, అవయవాలు.. కణజాలాల స్థితిని బట్టి దాతలను విశ్లేషిస్తారు. అవయవాలను, కణజాలాలను తొలగించేటప్పుడు వాటి స్థితిని బట్టి మార్పిడికి ఉపయోగపడతాయో లేదో నిర్ణయిస్తారు.
బ్రెయిన్ డెత్ అంటే?
మెదడుకు తీవ్రంగా, మానటానికి వీల్లేని విధంగా దెబ్బ తగిలినప్పుడు బ్రెయిన్ డెత్ సంభవిస్తుంది. సాధారణంగా రోడ్డు, రైలు ప్రమాదాల్లో బాగా గాయపడినవారు ఇలాంటి స్థితికి చేరుకుంటారు. ఆక్సిజన్ అందకపోవటం వల్ల వీరిలో మస్తిష్క మూలం, మెదడులోని అతిపెద్ద భాగమైన సెరిబ్రమ్‌తో పాటు అన్ని భాగాలూ దెబ్బతింటాయి. ఇలాంటి పరిస్థితిలో తనకు తానుగా మనుగడ సాగించలేరు. జీవానికీ శవానికీ మధ్య కొట్టుమిట్టాడుతుంటారు. కానీ కీలక అవయవాలు పనిచేయటానికి బయటి నుంచి చికిత్స అందించొచ్చు. ఆయా అవయవాలను తొలగించేంతవరకూ వాటికి రక్త సరఫరా జరిగేలా చేయొచ్చు.
బ్రెయిన్ డెత్‌ను ఎవరు ధ్రువీకరిస్తారు?
బ్రెయిన్ డెత్‌ను నలుగురు డాక్టర్ల బృందం ధ్రువీకరిస్తుంది. ఇందులో న్యూరాలజిస్టు లేదా న్యూరోసర్జన్, ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్, చికిత్స చేసే వైద్యుడు, వేరే ఆసుపత్రికి చెందిన డాక్టర్ ఉంటారు. వైద్య, న్యాయ నిబంధనలకు లోబడి మరణాన్ని ధ్రువీకరిస్తారు.
ఎంత సేపట్లో అవయవాలు తీస్తారు?
బ్రెయిన్ డెత్‌ను ధ్రువీకరించిన తర్వాత కుటుంబ సభ్యుల ఆమోదంతో వెంటనే అవయవాలను తీయాల్సి ఉంటుంది. ఒకవేళ అవయవాలను తీయటం ఆలస్యమైనట్టయితే జీవన్మృతుల్లో రక్త ప్రసరణ కొనసాగేలా చూడాల్సి ఉంటుంది. ఇందుకోసం కృత్రిమ శ్వాస కల్పిస్తారు. అవయవాలు, కణజాలం తడారకుండా వాటిపై ద్రవాలు చల్లుతారు. అవయవాలను తొలగించిన తర్వాత 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో భద్రపరచి, కొద్ది గంటల్లోనే (కోల్డ్ ఇస్కీమిక్ టైమ్ లోపు) మార్పిడి చేయాల్సి ఉంటుంది. ఈ సగటు సమయం ఆయా అవయవాలను బట్టి ఉంటుంది. ఉదాహరణకు- గుండెను 4-6 గంటల్లోపు.. కాలేయం, క్లోమం 12 గంటల్లోపు.. కిడ్నీ 24 గంటల్లోపు మార్పిడి చేయొచ్చు.
ఏంటీ ప్రయోజనం?
అవయవాలు విఫలమై, మరణానికి చేరువైనవారి ప్రాణాలను నిలిపే గొప్ప మార్గం అవయవ దానం. జీవితం మీద ఆశ కోల్పోయి, ఎన్ని రోజులు జీవిస్తామో తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది. అప్పటివరకూ బాధలు, ఇబ్బందులతో సతమతమైవారి జీవితం దీంతో గణనీయంగా మెరుగవుతుంది. హాయిగా, ఆనందంగా గడపటం సాధ్యమవుతుంది.
ఎంతవరకూ సురక్షితం?
కఠినమైన వైద్య ప్రమాణాల మేరకే అవయవ మార్పిడి చేస్తారు. వీటిని గ్రహించినవారు జీవితాంతం రోగనిరోధక శక్తిని అణచిపెట్టే మందులు వేసుకోవాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. బతికి ఉన్నవారి నుంచైతే అన్ని అంశాలనూ క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే మార్పిడి కోసం అవయవాలను సేకరిస్తారు. ఈ ప్రక్రియలో కిడ్నీ వంటి అవయవాలను దానం చేసినవారు క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించి, ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. జబ్బుల ముప్పు తగ్గించు కోవటానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి.
దాతల నమోదు ఎలా?
అవయవాలను దానం చేయాలనుకున్నవారు జాతీయ స్థాయిలో నేషనల్ ఆర్గన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ అసోసియేషన్ (ఎన్‌ఓటీటీఓ), ప్రాంతీయ స్థాయిలో జీవన్‌దాన్ కార్యక్రమంలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే దానానికి అంగీకరిస్తూ, అవసరమైన వివరాలను పూరించాలి. నమోదు చేసుకున్నాక ప్రత్యేకమైన నంబరుతో కూడిన డోనర్ కార్డు జారీ అవుతుంది. తాను అవయం దానం చేయాలనుకున్నానని, ఇందుకోసం తన పేరును నమోదు చేసుకున్నానని కుటుంబ సభ్యులకు తెలియజేయాలి.
- Telugu News
- Health News
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
తాజా వార్తలు (Latest News)
జాన్వీ కపూర్ మెరుపు.. గోదారి తీరాన అదితి.. మౌనీరాయ్ రిపీట్!
స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. మీ నగరంలో ఎంతంటే..?
జన్మలో ఇక రాజకీయాల గురించి మాట్లాడను.. పోసాని సంచలన ప్రకటన
- Latest News in Telugu
- Sports News
- Ap News Telugu
- Telangana News
- National News
- International News
- Cinema News in Telugu
- Business News
- Political News in Telugu
- Photo Gallery
- Hyderabad News Today
- Amaravati News
- Visakhapatnam News
- Exclusive Stories
- Kids Telugu Stories
- Real Estate News
- Devotional News
- Food & Recipes News
- Temples News
- Educational News
- Technology News
- Sunday Magazine
- Rasi Phalalu in Telugu
- Web Stories
- Pellipandiri
- Classifieds
- Eenadu Epaper
For Editorial Feedback eMail:
For digital advertisements Contact : 040 - 23318181
- TERMS & CONDITIONS
- PRIVACY POLICY
- ANNUAL RETURN
© 1999 - 2024 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.
This website follows the DNPA Code of Ethics .
Privacy and cookie settings
- Samayam News
- Telugu News
- World Organ Donation Day 2022 Significance History And Key Facts
World Organ Donation Day : అవయవ దానం .. మహా దానం .. కొన్ని నిజాలు
World organ donation day : అవయవాల్ని ఎందుకు దానం చెయ్యాలి అనే ప్రశ్నకు డాక్టర్లు స్పష్టమైన సమాధానం ఇస్తున్నారు. మనం మనకు కావాల్సిన ఎన్నో రకాల వస్తువుల్ని కృత్రిమంగా తయారుచేసుకోగలుగుతున్నాం. కానీ అవయవాల్ని తయారుచేసుకోలేకపోతున్నాం. అందువల్ల చనిపోయిన వ్యక్తుల అవయవాల్ని అవసరమైన వారికి సెట్ చెయ్యడం ద్వారా వారికి మరో జన్మ ఇచ్చినట్లవుతుంది. ఈ విషయంలో ఇండియా చాలా చాలా వెనకబడి ఉంది. దీనిపై మనం కొంత మాట్లాడుకుందాం..
సూచించబడిన వార్తలు
- తెలుగు English हिंदी मराठी ਪੰਜਾਬੀ தமிழ் മലയാളം বাংলা ಕನ್ನಡ ଓଡିଆ অসমীয়া ગુજરાતી
తాజా వార్తలు, వాతావరణ నవీకరణలు, పరిశ్రమ వార్తలు, వస్తువుల నవీకరణ, కొత్త ఉత్పత్తి లాంచ్‌లు మొదలైనవి చదవండి...
అగ్రిపీడియా
వ్యవసాయం, సాగు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై ప్రతిదీ తెలుసుకోండి.
ఆరోగ్యం మరియు జీవనశైలి
మేము మీకు చాలా సందర్భోచితమైన కథలను తీసుకువస్తాము మరియు ఆరోగ్యం మరియు జీవనశైలి విజయ కథలపై
దేశవ్యాప్తంగా వ్యవసాయ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన కథలను మేము కవర్ చేసాము
జంతు పశుసంవర్ధకం
ప్రపంచవ్యాప్తంగా పశుసంవర్ధక సంబంధిత నవీకరణల గురించి మొత్తం సమాచారాన్ని పొందండి
వ్యవసాయ యంత్రాలు
వ్యవసాయానికి సంబంధించిన నవీకరణల గురించి మొత్తం సమాచారం పొందండి.
వ్యవసాయం మరియు సంబంధిత పరిశ్రమపై దేశాన్ని ప్రేరేపించడానికి ఎంచుకున్న వీడియోలు
క్విజ్ తీసుకోండి మరియు మీ వ్యవసాయ జ్ఞానాన్ని పరీక్షించండి
Subscribe to our print & digital magazines now
We're social. Connect with us on:
Health & Lifestyle
ప్రపంచ అవయవధాన దినోత్సవం.......
మనిషి శరీరంలో ప్రతీ అవయవానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, ఏ ఒక్క అవయవం సరిగ్గా పని చెయ్యకపోయిన సరే ఆ ప్రాభవం మొత్తం శరీరం మీద పడుతుంది. ఒక మనిషి అవయవ దానం చేస్తే చాలా మంది ప్రాణాలను నిలపవచ్చు. ఇంతటి విశిష్టత ఉన్న అవయవధానాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది ఆగష్టు 13 న ప్రపంచ అవయవ ధాన దినోత్సవంగా నిర్వహిస్తారు. ఇతరుల ప్రాణాలు కాపాడాంలన్న సదుద్దేశంతో ముందుకు వచ్చిన వారిని కూడా ఈ రోజు సత్కరిస్తారు.
అవయవ దానం ఒక ఒక వ్యక్తి జీవితాన్ని నిలబెట్టగలిగే మహత్తర కార్యం. ప్రతి ఏటా అవయవాలు పాడై, సరైన సమయానికి అవయవాలు దొరక్క ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. మనిషి చనిపోయిన తరువాత అతని అవయవాలు వృధాగా మట్టిలో కలిసిపోకుండా, అవి నలుగురికి ఉపయోగపడాలి. ప్రపంచ వ్యాప్తంగా అవయవ దానం యొక్క ప్రాముఖ్యతను అందరికి తెలియచేసే విధంగా ప్రతిఏడాది ఆగష్టు 13 న ప్రపంచ అవయవదాన దినోత్సవంగా నిర్వహిస్తారు. అవయవ దాన ఆవశ్యకత గురించి అవగహన పెంచడానికి ఈ రోజును జరుపుకుంటారు. ఈ రోజు అనేక కార్యక్రమాల ద్వారా అవయవ దాన ప్రక్రియ గురించి అవగాహన కల్పిస్తారు.
చాలా మందిలో అవయవదాన ప్రక్రియలో ఎన్నో అపోహలు ఉంటాయి. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవయవదానం పట్ల ఉన్న అపోహలను తొలగించి చైతన్యం తీసుకువస్తారు. అవయవదానం మీద అవగాహన కల్పించడంలో ఈ రోజు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఒక్క వ్యక్తి అవయవ దానం చెయ్యడం ద్వారా ఆపదలో ఉన్న ఎంతో మంది వ్యక్తులకు ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి జీవితాన్ని కాపాడి కొత్త జీవితాన్ని ప్రసాదించాడనికి అవకాశం ఉంటుంది. వైద్యుల ప్రకారం ఒక వ్యక్తి అవయవ ధానాం చేస్తే దాదాపు 7 మంది కొత్త జీవితాన్ని ఇచ్చినవారవుతారని వైద్యులు చెబుతున్నారు.
కాబట్టి ప్రతి ఒక్కరు అవయవదానం ప్రాముఖ్యతను తెలుసుకుని,ఇతరులకు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవయవ దానానికి సంబంధించిన అపోహలను నివృత్తి చేయడం ద్వారా మరింతమందికి అవయవదానంపై అవగాహన పెంచడమేకాకుండా లక్షలాది మంది జీవితాలను కాపాడవచ్చు.
వెల్లుల్లిపాయను ఈ విధంగా వాడారంటే జుట్టు రాలడం తగ్గిపోతుంది
పీటలు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా, related topics.
ఆస్తమా ఎలా వస్తుంది? దీనిని ఎలా నిర్ధారించాలి
శరీరంలో అదనపు కొవ్వును తగ్గించే కివి పండు!!
స్పైసి ఫుడ్ ఎక్కువుగా తింటున్నారా? దీని దుష్ప్రభావాలు ఏమిటి
పాలను ఎక్కువసేపు నిల్వ చెయ్యడానికి ఈ చిట్కాలు పాటించండి
Share your comments.
Top Stories
రైతులకు శుభవార్త పీఎం కిసాన్ విడుదల తేదీని ప్రకటించిన ప్రభుత్వం
కేవలం వీరికే రైతుభరోసా ;తెలంగాణ వ్యవసాయ మంత్రి కీలక ప్రకటన
వరి పంట నష్ట పోయిన రైతులకు ఎకరానికి 10 వేలు: సిఎం చంద్రబాబు
రైతులకు ఆధార్ తరహా ప్రత్యేక ఐడి కార్డులు ఇవ్వనున్న ప్రభుత్వం; లాభాలు ఏంటి?
పూర్తి కావస్తున్న రుణమాఫీ సర్వే, త్వరలో రైతులందరికీ రుణమాఫీ
Subscribe to our newsletter
Sign up with your email to get updates about the most important stories directly into your inbox
More on Health & Lifestyle
మైదా గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు, శంఖు పూలతో టీ, ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది...., మునగాకు ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా, యూరిక్ ఆసిడ్ సమస్యకు సరైన పరిష్కారం ఈ డ్రైఫ్రూట్స్, వెరికోస్ వెయిన్స్ అంటే ఏమిటి ఇవి ఉన్నవారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, వేపాకుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.....
- Latest News
IMAGES
VIDEO